News June 5, 2024
డిపాజిట్ కోల్పోయిన పూతలపట్టు MLA

చిత్తూరు జిల్లాలో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏకంగా డిపాజిట్ కోల్పోయాడు. ఆయనే ఎంఎస్ బాబు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన 29,163 ఓట్లతో భారీ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ సీటు ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఆయనకు కేవలం 2,820 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి మురళీ మోహన్ 15,634 ఓట్లతో గెలిచారు. దీంతో బాబు డిపాజిట్ కోల్పోయారు.
Similar News
News July 6, 2025
తవణంపల్లిలో రోడ్డు ప్రమాదం

తవణంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మాధవరం వెళుతున్న ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో అరగొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌తో డ్రైవర్ పరారయ్యాడు. మరెన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
చిత్తూరు: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
News July 6, 2025
చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసుల పరిష్కారం

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.