News June 27, 2024

డిప్యూటి సీఎంను కలిసిన కత్తెర దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ జిల్లా పరిషత్ నందు దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సమస్యలను డిప్యూటి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News December 6, 2025

GNT: గర్భందాల్చిన ఇంటర్ విద్యార్థిని.. యువకుడిపై కేసు నమోదు

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణమైన పొట్టిశ్రీరాములునగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. PS నగర్‌కి చెందిన విద్యార్థినికి అదే ప్రాంతానికి చెందిన నాని అనే యువకుడు మాయమాటల చెప్పి లోబరుచుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

News December 6, 2025

GNT: రూ.10కి వ్యర్థాలు ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News December 5, 2025

పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

image

వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.