News July 18, 2024

డిప్యూటీ సీఎంకు నర్సాపురం MPDO రాసిన లేఖ వైరల్

image

నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Similar News

News October 30, 2025

పంట వివరాలను 5రోజుల్లో నివేదిక ఇవ్వాలి: జేసీ

image

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను ఐదు రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయం నుంచి మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వలన నీట మునిగిన పంటల వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News October 30, 2025

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం: కలెక్టర్

image

జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అమలు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున సహాయం అందజేయాలన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, కంది పప్పు, వంట నూనె, ఉల్లిపాయలు అందిస్తున్నామన్నారు.

News October 30, 2025

పారిశుద్ధ్య చర్యలు ముమ్మురంగా చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మురంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. తాగునీరును క్లోరినేషన్ చేసిన తర్వాతనే విడుదల చేయాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలను పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అనంతరం తరగతులు నిర్వహించాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వినియోగించాలన్నారు.