News June 29, 2024
డిప్యూటీ సీఎంగా పిఠాపురానికి తొలిసారి పవన్
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ జులై 1న తొలిసారి పిఠాపురం రానున్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలపనున్నారు. ఉప్పాడ సెంటర్‌లో జరిగే వారాహి సభలో పవన్ ప్రసంగిస్తారు. 3రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు వారాహి సభకు ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల నుంచి జనసేన నేతలు, అభిమానులు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. ఏర్పాట్లపై కాకినాడ కలెక్టర్ షన్మోహన్ శుక్రవారం సమీక్షించారు.
Similar News
News December 5, 2024
ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటు వేయనున్న 16,737 మంది టీచర్లు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. దీంతో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ జరగనుంది.
News December 4, 2024
రాజమండ్రిలో భూ ప్రకంపనలు
రాజమండ్రిలో బుధవారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. టీ నగర్, శ్యామల సెంటర్ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయన్నారు. ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
News December 4, 2024
రాజమండ్రి: ‘ఇంటర్ విద్యార్థులకు గమనిక’
2025 సంవత్సరం మార్చి నెలలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు డిసెంబర్ 5వ తేదీ లోగా అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చునని తూ.గో జిల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఐఓఎన్ఎస్వి ఎల్. నరసింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జనరల్, ఓకేషనల్ కోర్సులు చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.