News January 23, 2025
డిప్యూటీ సీఎంతో బీటెక్ రవి భేటీ

పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యురేనియం ప్రాజెక్ట్ నుంచి వెలువడుతున్న వ్యర్థాల నుంచి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అలాగే భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పునరావాసం, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. యురేనియం బాధితులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
Similar News
News February 12, 2025
కడప: టెన్త్ అర్హతతో 72 ఉద్యోగాలు

కడప డివిజన్‌లో 40, ప్రొద్దుటూరు డివిజన్‌లో 32 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
కడప జిల్లా ఎస్పీని కలిసిన మహిళా పోలీసులు

కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈజీ అశోక్ కుమార్‌ను జిల్లా మహిళా పోలీసుల అసోసియేషన్ మంగళవారం కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిశారు. నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిశామన్నారు. అనంతరం మహిళా పోలీసుల సంక్షేమానికి కృషి చేయాలని ఎస్పీని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కే వసంత లక్ష్మి, జిల్లా ప్రెసిడెంట్ ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
News February 11, 2025
కడప జిల్లాలో విషాదం.. తల్లి, కొడుకు మృతి

కడప జిల్లా బి.కోడూరు మండలం గుంతపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో తల్లి, కుమారుడు మృతి చెందారు. తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.