News June 19, 2024

డిప్యూటీ సీఎంను కలిసిన గుంటూరు జిల్లా ఎస్పీ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కల్యాణ్‌ని మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, మంగళవారం గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై చేపట్టిన చర్యలపై పవన్‌తో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.

Similar News

News September 14, 2024

గుంటూరులో ఇంటర్ విద్యార్థిని మృతి

image

గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో శనివారం దారుణం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

గుంటూరు: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.

News September 14, 2024

17న నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ: DMHO

image

జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి వెల్లడించారు. మధ్యాహ్నం బోజనం అనంతరం 1-2 సంవత్సరాల వయసు వారికి ఆల్బెండ జోల్ అరమాత్ర, 2-19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.