News October 27, 2024

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు నేడు ఉదయం పలు ప్రారంభోత్సవాలకు డిప్యూటీ సీఎం రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బస్ స్టాప్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్, బ్యాంకు, భోజనశాలను పరిశీలించారు.

Similar News

News November 2, 2024

కొత్తగూడెం: తండ్రిని చంపిన కుమారుడు

image

మణుగూరు పగిడేరు ఎస్టీ కాలనీకి చెందిన కుంజా భీమయ్యను (59) తన కొడుకు కుంజా రాములు శుక్రవారం రాత్రి కర్రతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు వివరాలిలా.. మద్యం మత్తులో ఉన్న రాములు కర్రతో భీమయ్య తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భీమయ్యను ఆస్పత్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

News November 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లి లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

News November 1, 2024

 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో తుమ్మల భేటీ

image

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ట్రంక్ కు సంబంధించి అంశంపై చర్చించారు. వచ్చే పంట కాలం లోపల నీరు వచ్చే విధంగా పనులు ప్రారంభించి సత్తుపల్లికి నీరు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. కావాల్సిన భూ సేకరణ, ఇతర పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.