News March 20, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బేబినాయన భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. బాడంగి మండలం గొల్లాదిలో వేగవతి నదిపై వంతెన ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పామని వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే నిర్మాణం వలన బాడంగి, రాజాం, దత్తిరాజేరు, మెరకముడిదాం గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News April 24, 2025
రామభద్రపురం : పరీక్షా ఫలితాలు వెలువడకముందే విద్యార్థి సూసైడ్

రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన కర్రి దుర్గాప్రసాద్ (15) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయంతో ముందే ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు సాలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా నిన్న వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
News April 24, 2025
VZM: ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు

జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
News April 24, 2025
బాలికను రక్షించిన కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం

విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.