News January 23, 2025
డిప్యూటీ CMతో బాలినేని భేటీ
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాజకీయ అంశాలపై సమాలోచనలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
Similar News
News January 26, 2025
ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో తేనేటి విందు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం సందడిగా సాగింది. మంత్రి స్వామి, ఎస్పీ దామోదర్, జిల్లా జడ్జి ఏ.భారతి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మార్కాపురం సబ్కలెక్టర్గా వెంకట త్రివినాగ్, MLA విజయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News January 26, 2025
కొండపి విద్యార్థుల క్రియేటివిటీ సూపర్
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కొండపి గురుకుల పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాని పోలిన నమూనాతో పాటు జాతీయ ఓటర్ల దినోత్సవం అక్షరమాల ఆకారంలో కూర్చున్నారు. ఈ చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది. విద్యార్థుల క్రియేటివిటీని పలువురు టీచర్లు అభినందించారు. అనంతరం ఓటు గురించి విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు.
News January 26, 2025
ప్రకాశం కలెక్టర్కు అవార్డు
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 లభించింది. శనివారం విజయవాడలోని జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతులమీదుగా అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన వారి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు అవార్డు అందుకున్నారు.