News January 23, 2025
డిప్యూటీ CMతో బాలినేని భేటీ

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాజకీయ అంశాలపై సమాలోచనలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
Similar News
News February 16, 2025
ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News February 16, 2025
ఒంగోలు: ‘దివ్యాంగుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News February 15, 2025
వెలిగండ్ల మండలంలో సూపర్‌వైజర్ ఆత్మహత్య

వెలిగండ్ల మండలంలోని పద్మాపురంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం లేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవే ఫైవ్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఏనుగు ప్రతాపరెడ్డి శనివారం ఇంటి ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ భీమా నాయక్, ఎస్ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.