News November 6, 2024

డిసెంబర్ 15లోపు అందుబాటులోకి తేవాలి: గుంటూరు కలెక్టర్

image

గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ప్రాంతీయ గ్రంథాలయాన్ని, పాత గుంటూరులోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్‌ భవనాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.

Similar News

News November 24, 2024

కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు: సవిత

image

అమరావతి: కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో తగిన స్థానం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనంగా మద్దిరాల గంగాధర్‌ని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమించడమే అని ఆమె అన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల బాటపట్టారన్నారు.

News November 24, 2024

గుంటూరు: RRB పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక రైళ్లు

image

RRB పరీక్షల అభ్యర్థులకు విజయవాడ మీదుగా గుంటూరు(GNT)-సికింద్రాబాద్(SC) మధ్య అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07101 GNT-SC, నం.07102 SC-GNT మధ్య ఈనెల 24, 25, 26, 28, 29న ఈ రైళ్లను నడుపుతామన్నారు. ఆయా తేదీలలో ఉదయం 8 గంటలకు GNTలో బయలుదేరే ఈ రైలు సాయంత్రం 4.15కి SC చేరుకుంటుందని, తిరిగి 5.45కి SCలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 2 గంటలకు GNT వస్తుందన్నారు.

News November 24, 2024

IPL వేలంలో మన గుంటూరు కుర్రాళ్లు.!

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో గుంటూరుకు చెందిన షేక్ రషీద్ రూ.30లక్షలు, పృథ్వీరాజ్‌యర్రా రూ.30లక్షల బేస్ ప్రస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన గుంటూరు జిల్లా ఆటగాళ్లు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.