News December 15, 2024
డిసెంబర్ 17న HYD రానున్న రాష్ట్రపతి
డిసెంబర్ 17న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శీతకాల విడిదికి HYD రానున్నారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు ఇక్కడే ఉంటారు. HYD మల్కాజ్గిరి జిల్లాలో తన పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో కలెక్టర్ గౌతమ్ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలన్నారు.
Similar News
News January 20, 2025
HYD: త్వరలో ఐటీ కారిడార్లలో పాడ్ కార్లు..!
మెట్రో స్టేషన్ నుంచి నేరుగా కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ సంకల్పించింది. ఈ వ్యవస్థలో భాగంగా పాడ్ కార్ లేదా పాడ్ ట్యాక్సీలను పరిచయం చేసి ప్రత్యేక కారిడార్లలో వాటిని నడిపేందుకు రూ.1,480 కోట్ల అంచనా వ్యయంతో DPRను సిద్ధం చేసినట్లు సమాచారం. నెలాఖరులోగా లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించి నిధులు కోరనుంది.
News January 20, 2025
HYD: దోబీ అనే పదం వద్దని కేంద్ర మంత్రికి వినతి
దోబీ అనే పదంతో తెలుగు రాష్ట్రాల్లో రజకుల హక్కులకు భంగం కలుగుతోందని రాష్ట్ర రజక మహిళా సంఘం ఫౌండర్ ఛైర్మన్ మల్లేశ్వరపు రాజేశ్వరి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు పట్నా హైకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాలను తెలుపుతూ ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ గెజిట్‌లో దోబీ అనే పదంతో ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరిగి స్థానికంగా ఉన్న రజకులకు అన్యాయం జరుగుతోందని ఆమె వాపోయారు.
News January 20, 2025
HYD: 10TH, ఇంటర్, ITI, డిగ్రీ వారికి బెస్ట్ ఛాన్స్
HYD నాంపల్లి పరిధి మల్లేపల్లి ITI కాలేజీలో నేషనల్ ఇంటర్న్‌షిప్ మేళా నేడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుందని అధికారులు తెలిపారు. 5వ తరగతి నుంచి 12 వరకు పాసైన వారు, ITI, బీటెక్ డిగ్రీ, ఇతర డిగ్రీలు చేసినవారికి ఇంటర్న్‌షిప్ అందించి, ఉద్యోగాలు కల్పించనున్నారు. 1000కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటారని, అన్ని జిల్లాల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.