News March 4, 2025
డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష

వేసవికాలంలో అధిక వినియోగానికి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వేసవిలో విద్యుత్ వినియోగం, వ్యవసాయ కనెక్షన్లు, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై సోమవారం డిస్కంల సీఎండీలతో ఆయన సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి కాలంలో రైతులకు 9గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని తెలిపారు.
Similar News
News December 1, 2025
వేములవాడ(R) మండలంలో 34 వార్డులు ఏకగ్రీవం

వేములవాడ రూరల్ మండలంలో 34 వార్డుల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలకు సంబంధించి 146 వార్డులలో 34 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జయవరంలో 7, అచ్చన్నపల్లి 5, బొల్లారం 3, చెక్కపల్లి 2, ఫాజుల్ నగర్ 4, మల్లారం 1, నాగయ్యపల్లి 1, నమిలిగుండుపల్లి 1, తుర్కాశినగర్ 5, వెంకటంపల్లిలో 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
News December 1, 2025
HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 1, 2025
ఒకే పోస్టులో ఇద్దరు TTD ఉద్యోగులు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇద్దరు సూపరింటెండెంట్లు ఉంటారు. ఇందులో ఓ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. ఇటీవల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యుటేషన్‌పై సురేష్ బాబుకు పోస్టింగ్ ఇచ్చారు. 2రోజులు క్రితం మునిచెంగల్ రాయులకు సూపరింటెండెంట్‌గా ఇవ్వడంతో ఇద్దరు ఏ పని చేయాలో తెలియలేదు. డిప్యూటీ ఈవో సెలవుపై ఉండడంతో ఈ సమస్య నెలకొంది. ఆయన సెలవుపై వచ్చాక ఎవరికి ఏ విధులు అనేది క్లారిటీ వస్తుంది.


