News February 26, 2025

డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాట్లు పూర్తిచేయాలి: కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాట్లు పూర్తిచేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అయన మంగళవారం పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా తాగునీరు  ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News March 24, 2025

పబ్లిక్ ఇష్యూకు Meesho

image

దేశీయ ఇ-కామర్స్ కంపెనీ Meesho పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. బిలియన్ డాలర్ల విలువైన IPO కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ బ్యాంకును లీడ్ బ్యాంకర్లుగా ఎంచుకుందని తెలిసింది. గత ఏడాది $3.9B గా ఉన్న విలువను 2.5 రెట్లకు పెంచి $10Bగా చూపాలని భావిస్తోంది. సేల్స్ పెరుగుతాయి కాబట్టి దీపావళి టైమ్‌లో లిస్టింగ్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకు మీషో బలమైన పోటీదారుగా అవతరించింది.

News March 24, 2025

సంచలనం.. రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్ట్’!

image

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.50.80 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దాదాపు రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి భారీ లాభాలను పొందింది. థియేటర్ కలెక్షన్లతో పాటు శాటిలైట్, ఓటీటీ రైట్స్‌కు మరిన్ని లాభాలొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News March 24, 2025

అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన 

image

పరిహారం చెల్లించిన తర్వాతే రహదారి పనులు మొదలు పెట్టాలని అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో రోడ్డు నిర్వాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ బ్రహ్మాజీ, ఆర్ రాము మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లు ఇస్తే వీరికి ఉపయోగం లేదన్నారు. బాండ్ల స్థానంలో నగదు చెల్లించాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు.

error: Content is protected !!