News July 17, 2024
డీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: CP సునీల్ దత్

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే DSC పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS చట్టం అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని 6 పరీక్ష కేంద్రాలలో జులై 18 తేదీ నుంచి ప్రతి రోజు 163 ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: పోలింగ్ సిబ్బంది 3వ దశ ర్యాండమైజేషన్ పూర్తి

జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామా రావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో మంగళవారం పూర్తి చేశారు. 192 గ్రామ పంచాయతీలు, 1,740 వార్డులకు గాను 1,582 బృందాలను ఏర్పాటు చేసి, 20 మంది సిబ్బందిని రిజర్వ్లో ఉంచారు. 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఓపీలను మండలాలవారీగా కేంద్రాలకు కేటాయించారు.
News December 9, 2025
ఖమ్మం: రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్ష జరిగింది. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.


