News July 8, 2024
డీఎస్సీ పరీక్ష గడువు పెంచండి.. భట్టికి వినతి

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్ష గడువు పెంచాలని ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని, డీఎస్సీకి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉందని, చదువుకునేందుకు తగిన సమయం కేటాయించాలన్నారు. పరీక్షను మరో 3 నెలల అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు.
Similar News
News November 20, 2025
తండ్రి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి

ఖమ్మం కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తన భార్య సాయి వాణిని భర్త భాస్కర్ అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా మొదట తన కన్న కూతురిని చంపేందుకు భాస్కర్ ప్రయత్నించగా అతడి నుంచి చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ దాడి ఘటనలో చిన్నారి మూడు వేళ్లు తెగిపోయాయని స్థానికులు తెలిపారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 20, 2025
ఖమ్మం: అమ్మ ఆదర్శ కమిటీలకు నిధులు విడుదల

ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణ కోసం ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ఖాతాలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిధులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,160 పాఠశాలలకు సంబంధించి మొత్తం రూ.1,13,78,000 నిధులను విడుదల జారీ చేశారు. రెండు నెలల కాలానికి ఉద్దేశించిన ఈ నిధులను ఏఏపీసీ సభ్యులు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, టాయిలెట్ల శుభ్రత, ఆవరణ నిర్వహణ కోసం వినియెాగించాలని సూచించారు.
News November 20, 2025
ఖమ్మం జిల్లాలో 43 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో 43బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. NHAIపరిధిలో 4చోట్ల, జాతీయ రహదారుల్లో 33చోట్ల, ఇతర రోడ్లపై 6చోట్ల ప్రమాదకర ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 126కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు నివేదికలో తేలింది. మరమ్మతుల కోసం రూ.15కోట్లు అవసరమని అంచనా వేశారు. మున్సిపల్ పరిధిలోని 470గుంతల పూడ్చివేతకు 6ప్యాకేజీలుగా టెండర్లు చేపట్టారు.


