News October 1, 2024
డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన ఖమ్మం జిల్లా

నిన్న వెల్లడైన డీఎస్సీ ఫలితాలలో ఖమ్మం జిల్లా వాసులు సత్తా చాటారు. నీల శ్రీనివాసరావు (సత్తుపల్లి) SAసోషల్ 1వ ర్యాంక్, రెడ్డి మాధురి (కల్లూరు చిన్నకొరుకొండి)SGT 1వర్యాంక్, వలసాల ఉమా (కల్లూరు) SGT 2వ ర్యాంక్, ఈలప్రోలు సునీత (పోద్దుటూరు)3వ ర్యాంక్ SGT(SPL), చిల్లపల్లి రాధాకృష్ణ (కందుకూరు) SGT 7వర్యాంక్, మండవ ప్రియాంక (జీళ్లచెరువు)SGT 11వ ర్యాంక్, గొకేనెపల్లి పవిత్ర SGT 14వ ర్యాంక్ సాధించారు.
Similar News
News February 23, 2026
ఖమ్మం జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు!

ఖమ్మం జిల్లాలో వేసవి రాకముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 2 అడుగుల మేర నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, మధిర, కామేపల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. విచ్చలవిడి వాడకం, నీటి పొదుపు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మే నాటికి జల సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని భూగర్భజల శాఖ హెచ్చరిస్తోంది.
News February 23, 2026
ఖమ్మంలో తగ్గిన గాలి నాణ్యత.. 156కు చేరిన AQI

ఖమ్మం జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఆదివారం (FEB 22) నగరంలో వాయు నాణ్యత సూచీ (AQI) ఒక్కసారిగా 156కు చేరింది. గాలిలో PM2.5, PM10 వంటి సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత ‘అనారోగ్యకర’ స్థాయికి చేరడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 100 లోపు AQI ఉంటే నాణ్యమైన గాలిగా తేల్చారు.
News February 22, 2026
ఖమ్మం: ఈ నెల 24న లబ్ధిదారుల ఎంపిక

ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉదయం 11గంటలకు డ్రా పద్ధతిలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళలు తమ వెంట ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆయన సూచించారు.


