News June 29, 2024

డీఎస్ మరణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన ఎంపీ అర్వింద్

image

తన తండ్రి D.శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ అర్వింద్ FB ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అన్నా అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే..! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు. వారి కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న..! నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు, ఎప్పటికీ మాలోనే ఉంటావు’ అని పోస్ట్ చేశారు.

Similar News

News December 7, 2025

NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.

News December 7, 2025

NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

image

నిజామాబాద్ శివారులోని గూపన్‌పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్‌ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.

News December 6, 2025

స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేసిన NZB కలెక్టర్

image

NZB సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లకు పంపిస్తున్న పోలింగ్ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. సామగ్రి తరలింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో సాయగౌడ్ పాల్గొన్నారు.