News April 11, 2025

డీజీపీని కలిసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి

image

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న తోట చంద్రయ్య హత్య కేసు CID త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని డీజీపీ హరీశక కుమార్ గుప్తాను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. గురువారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 16వ తేదీన మాచర్ల పట్టణంలో జరిగిన అల్లర్లలో కేసు, ఎన్నికల సమయంలో జరిగిన కేసులను విచారణ జరిపి శిక్ష పడేలా చూడాలని డీజీపీని కోరారు.

Similar News

News February 12, 2026

మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్ తేజస్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు శిక్షణ ఇచ్చారు. సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా కౌంటింగ్ జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏజెంట్ల సమక్షంలోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

News February 12, 2026

గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

image

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గురుకుల విద్యాలయాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు నూతన ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి తూ.గో జిల్లా సమన్వయ అధికారి రాజకుమారి సూచించారు. 6 నుండి 10 తరగతిల వరకు ఉన్న ఖాళీలకు బాలురు బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. https://apgpcet.apcffss.in ఆన్లైన్లో ఈనెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు

News February 12, 2026

జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేడీ

image

భూపాలపల్లి జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్ వి.నాగరాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న బిల్లుల ఆన్‌లైన్ ప్రాసెసింగ్ విధానం, పెండింగ్ బిల్లుల స్థితి, జీతభత్యాల చెల్లింపులు, పెన్షన్ కేసుల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిధుల వినియోగం పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు.