News July 11, 2024
డీజీపీ జితేందర్.. తొలుత నిర్మల్ ఏఎస్పీ

నిర్మల్ సహాయక ఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టిన జితేందర్ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ ఏఎస్పీగా 6 జనవరి 1995 నుంచి 12 డిసెంబరు 1995 వరకు పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.. నిర్మల్ ఏఎస్పీగా ఉన్న సమయంలో ఆయన వివాహం జరిగింది. ఏడాదిపాటు పనిచేసిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేసినట్లు ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన పోలీసులు వెల్లడించారు.
Similar News
News February 20, 2025
ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కృష్ణ ఆదిత్య

వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కృష్ణ ఆదిత్య సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రానున్న వేసవిలో జిల్లాలోని ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.
News February 19, 2025
బజార్హత్నూర్‌లో మృతదేహం లభ్యం

బజార్హత్నూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ శవం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2025
ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.