News March 8, 2025

డీజేలపై కొరడా ఝలిపిస్తున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో డీజేలపై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో చదువుకునే విద్యార్థులకు డీజే శబ్దాల కారణంగా ఇబ్బంది పడటంతో పాటు వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వరంగల్ కమిషనర్ పరిధిలో డీజేల వినియోగంపై పోలీసులు నిషేధాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు కమీషనరేట్ పరిధిలో 9 డీజేలను పోలీసులు సీజ్ చేశారు.

Similar News

News December 3, 2025

NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

image

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్‌కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.

News December 3, 2025

సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: ASF SP

image

ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ భరోసా సెంటర్ భవన నిర్మాణానికి సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. డిసెంబర్ 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు AR పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విల్లింగ్ కొటేషన్స్ స్వీకరిస్తామన్నారు. రూ.కోటిపైగా వ్యయంతో నిర్మాణ అనుభవం, 10 ఏళ్ల సేవ, 4 నెలల్లో పని పూర్తి చేసే సామర్థ్యం అర్హతలుగా పేర్కొన్నారు.

News December 3, 2025

కోనసీమ జిల్లా వాసులకు GOOD NEWS

image

అమలాపురంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతి లక్ష్మి తెలిపారు. ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని ఆమె సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.