News March 4, 2025

డీజేలు పెడితే జైలుకే: వరంగల్ ఏసీపీ

image

వరంగల్ నగర ప్రజలకు ఏసీపీ నందిరం నాయక్ కీలక సూచనలు చేశారు. వివాహ, ఇతర వేడుకల్లో డీజే సౌండ్స్ పెట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DJలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్, SSC, ఇతర పోటి పరీక్షలు ఉన్నందున వివాహ ఊరేగింపు, ఇతర వేడుకల్లో DJ సౌండ్స్ పెట్టి విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలకి ఇబ్బంది కలిగించవద్దన్నారు. DJ ఆపరేటర్లు, యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు.

Similar News

News March 4, 2025

WGL: పెరిగిన మొక్కజొన్న, తగ్గిన పల్లికాయ ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు సోమవారం రూ.2,355 పలకగా.. నేడు రూ.2,360కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,500 ధర రాగా.. నేడు రూ.5,600 పలికింది. సూక పల్లికాయకి నిన్న రూ.7,500 ధర, నేడు రూ.6900కి పడిపోయింది.

News March 4, 2025

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తిధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. ఈరోజు రూ.40 పెరిగింది. దీంతో రూ.6,920 జెండా పాట పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

News March 4, 2025

మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం: WGL కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మహిళా ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఉ.10 గం.లకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో మహిళలు పాల్గొని పరీక్షలు చేయించుకోవాలన్నారు.

error: Content is protected !!