News August 27, 2024
డీప్ ఫేక్ టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా ఉండండి: ప్రకాశం పోలీస్

సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి మీకు తెలిసిన వ్యక్తుల వాయిస్‌తో ఫోన్ చేయటం లేదా ప్రముఖుల ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని డబ్బులు అడగటం, అత్యవసరం ఆపదలో ఉన్నామంటూ తొందరపెట్టి మీ నగదు కొట్టేసే ప్రయత్నం చేస్తారన్నారు. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ AR దామోదర్ తెలియజేశారు. సైబర్ నేరాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సంప్రదించాలన్నారు.
Similar News
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News November 30, 2025
తుఫాను ప్రభావం పడే 14 మండలాలు ఇవే.!

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.