News February 8, 2025
డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఈనెల 10వ తేదీన నిర్వహించే డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ఏర్పాటుపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆయా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్బెంజోల్ టాబ్లెట్స్ ఉచితంగా అందిస్తామన్నారు.
Similar News
News February 12, 2026
NRPT: కౌంటింగ్ కేంద్రాల్లో కఠిన నిబంధనలు

రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ ఆఫీసర్ జారీ చేసిన ఐడీ కార్డులతో మాత్రమే అనుమతించనున్నారు. సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, తినుబండారాలు, పెన్నులు వంటి వస్తువులకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వారు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య సూచించారు.
News February 12, 2026
ఢిల్లీలో TG CM రేవంత్ మీడియా చిట్ చాట్

* ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది నా వ్యక్తిగత డిమాండ్.. ఆయన జాతి సంపద
* ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలి
* ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు ఆధారాలేవీ తగలబడలేదు
* శంషాబాద్ ఎయిర్‌పోర్టు పక్కన బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మించాలని కేంద్రాన్ని కోరా.. అందుకు 600 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం.
News February 12, 2026
రాష్ట్ర సెక్రటేరియట్‌లో కృష్ణా జిల్లా ప్రణాళికలపై చర్చ

కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.


