News March 28, 2025

డీసీసీ ప్రెసిడెంట్ల సమావేశంలో పాల్గొన్న గద్వాల నాయకులు

image

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనదైన శైలిలో దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఢిల్లీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గద్వాల జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2025

ఉరవకొండ: తమ్ముడి పెళ్లి చూపులకు వెళ్తుండగా విషాదం

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

News April 20, 2025

తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ.. 

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2025

విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

image

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్‌లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.

error: Content is protected !!