News March 1, 2025

డుంబ్రిగూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

డుంబ్రిగూడ మండలం నారింజవలస సమీపంలో శుక్రవారం రోడ్డు <<15611939>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు నుంచి అరకులోయ వైపు వస్తుండగా స్కూటీ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈఘటనలో సోమనాథ్ మరణించగా రామ్మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News March 1, 2025

కడప రిమ్స్‌కు పోసాని

image

AP: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన నటుడు పోసాని కృష్ణమురళికి జైలులో అస్వస్థతకు గురవ్వగా రాజంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఈసీజీ పరీక్షలో వైద్యులు స్వల్ప తేడాలు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.

News March 1, 2025

కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్‌లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2025

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. GD నెల్లూరులో మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందజేస్తాం. జూన్‌ నాటికి DSC ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని పునరుద్ఘాటించారు.

error: Content is protected !!