News April 8, 2025
డుంబ్రిగూడ: డిప్యూటీ సీఎంకు ఉపాధి సిబ్బంది వినతి

డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో మంగళవారం పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అల్లూరి జిల్లా ఉపాధి సిబ్బంది తమ బాధలను ఏకరువు పెట్టారు. చాలీచాలని జీతాలతో గత 20ఏళ్ళు పైబడి పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా ఇబ్బందిగా మొర పెట్టుకున్నారు. పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర అలవెన్సులు మంజూరు చేయాలని కోరారు.
Similar News
News September 19, 2025
ఈ అసెంబ్లీ సమావేశాలకూ వైసీపీ దూరం?

AP: YCP MLAలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పదేపదే కోరినా.. ఇవాళ YCP సభ్యులెవరూ సమావేశాలకు రాలేదు. ఇదే సమయంలో ఆ పార్టీ LP సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మండలి సభ్యులే బలంగా పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
News September 19, 2025
NRPT: పత్తి కొనుగోళ్లలో మోసం చేస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

నారాయణపేట జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని అదనపు కలెక్టర్ ఎస్.శీను అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తూకాల్లో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 19, 2025
KNR: సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా షేక్ నిసార్ అహ్మద్

కరీంనగర్ జిల్లా సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ షేక్ నిసార్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లోని రెవెన్యూ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ కోసం షేక్ నిసార్ అహ్మద్ చేస్తున్న పోరాటాన్ని స్థితప్రజ్ఞ ప్రశంసించారు.