News February 6, 2025
డెంకాడలో టీచర్ ఆత్మహత్యాయత్నం..!

డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో ఓ ఉపాధ్యాయురాలు బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బలిజిపేట మండలానికి చెందిన ఆమె కొత్తవలసలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఐదు రోజుల క్రితం రాగా.. గదిలో ఉరివేసుకునేందుకు యత్నించారు. వెంటనే గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ నాయుడు తెలిపారు.
Similar News
News December 5, 2025
విశాఖ: పాఠశాలలో బాలికల వాష్రూమ్ వద్ద యువకుడి వెకిలి చేష్టలు

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు బాలికల వాష్రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకటరావుకు సమాచారం అందించారు. ప్రధానోపాధ్యాయుడు తక్షణమే పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News December 5, 2025
‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.
News December 5, 2025
డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ వినియోగించండి: పెద్దపల్లి కలెక్టర్

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శిక్షణ అనంతరం అదేరోజు మ.2 నుంచి సా.6 గంటల వరకు తమ ఓటు నమోదైన మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం-14, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తప్పనిసరిగా వెంట ఉంచాలన్నారు. సూచనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు.


