News February 6, 2025
డెంకాడలో టీచర్ ఆత్మహత్యాయత్నం..!

డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో ఓ ఉపాధ్యాయురాలు బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బలిజిపేట మండలానికి చెందిన ఆమె కొత్తవలసలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఐదు రోజుల క్రితం రాగా.. గదిలో ఉరివేసుకునేందుకు యత్నించారు. వెంటనే గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నాయుడు తెలిపారు.
Similar News
News January 18, 2026
వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

* BP, డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* వీటిలోని అల్లిసిన్, అజోయిన్ రక్తం గడ్డకట్టకుండా చేసి రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు సహాయపడతాయి.
* కీళ్లనొప్పులు, దీర్ఘకాలంగా ఉన్న వాపులను తగ్గిస్తుంది.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ప్రీ బయోటిక్‌గా పనిచేస్తుంది.
* పడుకునే ముందు తింటే మెరుగైన నిద్ర సొంతమవుతుంది.
* గొంతు, ఊపిరితిత్తుల సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
News January 18, 2026
మేడారం వేదికగా కేబినెట్ భేటీ

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీ అయింది. మేడారం హరిత హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన, యాసంగి రైతు భరోసా, మున్సిపల్ ఎన్నికలు వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. మేడారం జాతరకు జాతీయ హోదా సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది.
News January 18, 2026
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జగిత్యాల జిల్లా పోలీసుల కఠిన చర్యలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. Arrive Alive రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరో రోజు Drunk and Drive – Zero Tolerance Day నిర్వహించారు. పోలీసులు బ్రెత్ అనలైజర్‌లతో వాహనదారులను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.


