News August 16, 2024
డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి..!

డెంగ్యూ జ్వరంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. తీర్థాలకు చెందిన మాచర్ల మధు(30) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగా ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చూపించగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో డెంగ్యూ నిర్ధారణ అయింది. అటు అతని లివర్లకు కూడా ఇన్ఫెక్షన్ కావడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.
Similar News
News January 9, 2026
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బంకుల వద్ద భద్రత కోసం ఇరువైపులా 100 మీటర్ల మేర బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News January 9, 2026
ఎల్బీనగర్ – ఖమ్మం మధ్య ప్రత్యేక బస్సులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎల్బీనగర్ నుంచి ఖమ్మంకు నేడు, రేపు ప్రత్యేక నాన్-స్టాప్ డీలక్స్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10:30 గంటల వరకు మొత్తం 8 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
News January 9, 2026
యూరియా కోసం రైతుల పాట్లు.. అధికారుల ప్రకటనలకే పరిమితం!

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎరువుల కోసం రైతులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారుల సమన్వయ లోపంతో పంట పనులు వదులుకుని పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరాలో నిర్లక్ష్యం వీడి, తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.


