News July 11, 2024

డెంగ్యూ వ్యాధిపై ప్రకాశం కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ తమీమ్ అన్సారియా డెంగ్యూ మాసోత్సవంపై బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ డెంగ్యూ కేసులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎంలు విధిగా వారికి కేటాయించిన ఇండ్లను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను నమోదు చేయాలన్నారు.

Similar News

News December 9, 2025

ఇళ్ల స్థలాల దరఖాస్తుల్లో పెండింగ్ ఉండరాదు: JC

image

ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్‌లో లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో సోమవారం జేసీ మాట్లాడుతూ.. ఇంటి పట్టాల రీ- వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ-వెరిఫికేషన్‌పై MROలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

News December 9, 2025

ప్రకాశం: ‘డిసెంబర్ 31 వరకు అవకాశం’

image

ఇంట్లో గృహోపకరణాలపై అడిషనల్ లోడ్‌పై చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లు SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. 1కిలో వాట్‌కు రూ.2250 అవుతుందని రాయితీ వలన రూ.1250 చెల్లించవచ్చని అన్నారు. ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమేనని తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలను బట్టి లోడ్ కట్టుకోవాలన్నారు. తనిఖీల్లో లోడ్ తక్కువగా ఉంటే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

News December 9, 2025

ప్రకాశం SP మీ కోసంకు 119 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 119 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే వృద్ధులతో, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.