News November 21, 2024

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రావికమతంలో కేసు నమోదు

image

సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని SI ఎం.రఘువర్మ గురువారం తెలిపారు. 2024 మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారని గుడ్డిప గ్రామానికి చెందిన గల్లా నాని బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వర్మకు నోటీసులు స్వయంగా అందజేశామన్నారు.

Similar News

News October 16, 2025

విశాఖలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

image

షీలానగర్-సబ్బవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే విస్తరణతో విశాఖలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. షీలానగర్ నుంచి సబ్బవరం నేషనల్ హైవేకి 13KM మేర సిక్స్‌ లేన్ రోడ్డు వేయనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.964 కోట్లు మంజూరు చేయగా.. PM మోదీ నేడు కర్నూలు జిల్లా నుంచి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి పూర్తయితే విశాఖ పోర్టు నుంచి కార్గో నగరంలోకి రాదు. గాజువాక, విమానాశ్రయం వైపు వెళ్లే వారి ప్రయాణం సుగమం అవుతుంది.

News October 15, 2025

610 క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ: జీవీఎంసీ సీఎంవో

image

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని జీవీఎంసీ సీఎంవో నరేష్ కుమార్ కోరారు. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నామన్నారు. దీన్ని 100% నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 610 క్లాప్ వాహనాలు, 65 ఇ-ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.

News October 15, 2025

నిర్ధిష్ట సమయంలో రోడ్ల నిర్మాణం: వీఎంఆర్డీఏ ఛైర్మన్

image

మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. అర్హులైన వారికి టీడీఆర్ ఇవ్వాలన్నారు. సమస్యలు లేని చోట్ల రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే <<18005420>>రోడ్డు నిర్మాణం<<>> వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేశ్, సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.