News November 21, 2024
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రావికమతంలో కేసు నమోదు
సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని SI ఎం.రఘువర్మ గురువారం తెలిపారు. 2024 మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారని గుడ్డిప గ్రామానికి చెందిన గల్లా నాని బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వర్మకు నోటీసులు స్వయంగా అందజేశామన్నారు.
Similar News
News December 10, 2024
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
వాతావరణ శాఖ అధికారులు తుఫాన్ హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో అనకాపల్లి కలెక్టరేట్‌లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోసిన వరి పనలు పొలాలపై ఉంటే ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.
News December 10, 2024
విశాఖలో యువకుడి ప్రాణం తీసిన రూ.2 వేలు
లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) ఓ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్‌లో ఉంది. అది కట్టలేదని అతడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. 40 రోజుల క్రితమే పెళ్లి అయిన తన భార్యకు సైతం వాటిని పంపారు. మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 10, 2024
విశాఖ: హస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు పరార్
అల్లిపురం మహారాణిపేట పోలీసు పరిధి, అంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్‌ఛార్జ్ కచ్చా వేళంగిరి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘ, బెడపాటి చరణ్, నక్కాల కిరణ్ కుమార్, కార్తీక్ సాయంత్రం అయిన రాలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో వెదికారు.