News February 27, 2026

డోంట్ వర్రీ.. పులి కదలికల్ని గమనిస్తున్నాం: రంప FRO

image

పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం అటవీ డివిజన్‌లోని రంప, పెద్దకొండ, సూదికొండ, భీమవరం అటవీ సమీప గ్రామాలలో అటవీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పులి కదలికలు డ్రోన్ థెర్మల్ ఇమేజ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఆందోళన చెందవద్దని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు..

Similar News

News April 16, 2026

మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

News April 16, 2026

మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఏఏఐ సమీక్ష

image

వరంగల్‌లో మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు. కలెక్టర్ సత్య శారదతో కలిసి సమావేశమై రన్‌వే, టెర్మినల్ సదుపాయాలు, భద్రత అంశాలను సమీక్షించారు. అభివృద్ధి పనులపై అవసరమైన మెరుగుదలలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధితో రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

News April 16, 2026

ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

image

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.