News December 14, 2024

డోకిపర్రు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న CM చంద్రబాబు

image

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో CM  చంద్రబాబునాయుడు శనివారం పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్లో డోకిపర్రు చేరుకున్న చంద్రబాబుకు భూ సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వాహకులు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. కాగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Similar News

News December 28, 2024

కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

News December 27, 2024

స‌మ్మిళిత వృద్ధి సాధ‌న‌లో బ్యాంకులు కీల‌క‌పాత్ర పోషించాలి: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర 2047 సాకారం దిశ‌గా అమ‌లుచేస్తున్న ప్ర‌ణాళిక‌లు మంచి ఫ‌లితాలు ఇవ్వ‌డంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర‌, స‌మ్మిళిత వృద్ధి సాధ‌న‌లో బ్యాంకులు కీల‌క‌పాత్ర పోషించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో లీడ్ జిల్లా కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లా సంప్ర‌దింపుల క‌మిటీ, జిల్లాస్థాయి స‌మీక్షా క‌మిటీ స‌మావేశం జరిగింది.

News December 27, 2024

పేర్ని జయసుధ బెయిల్ పిటీషన్‌పై ముగిసిన వాదనలు

image

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 30న ఆర్డర్ పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై ఉదయం నుంచి వాడివేడిగా వాదనలు సాగాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా కోర్టు పీపీ లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.