News April 12, 2025
డోన్‌లో మెగా జాబ్ మేళా: కలెక్టర్ రాజకుమారి

జాబ్ మేళా ద్వారా యువత మెరుగైన ఉపాధి పొంది, జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని జీవిఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 16న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు naipunyam.ap.gov.in సంప్రదించాలన్నారు.
Similar News
News July 9, 2025
హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

మందస పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.
News July 9, 2025
JGTL: రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన యువతి

ICET-2025 ఫలితాల్లో మొత్తం 58,985 మంది ఉత్తీర్ణత సాధించగా మేడిపల్లి(M) కొండాపూర్(V)కి చెందిన వీరేశం, విజయలక్ష్మి కుమార్తె వైష్ణవి(22) రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. టాప్10లో ఇద్దరే అమ్మాయిలు ఉండగా అందులో మన మండలవాసి వైష్ణవి 5వ ర్యాంకు కొట్టింది. కాగా, ఈమె గతంలో <<16285740>>5బ్యాంకు ఉద్యోగాలు<<>> సాధించి అందరితో శెభాష్ అనిపించుకుంది. వైష్ణవి విజయాల పట్ల పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు.
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!

ఓరోజు తగ్గుతూ తర్వాతి రోజు పెరుగుతూ బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.