News January 28, 2025

డోన్ ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

image

డోన్(M) గుమ్మకొండకు చెందిన శివ ప్రసాద్(19) సూసైడ్ చేసుకున్నాడు. యువకుడు తిరుపతి సమీపంలో ఉన్న SVC ఇంజినీరింగ్ కళాశాలలో CEC చదువుతూ ఓ PG హాస్టల్లో ఉంటున్నాడు. గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ యజమాని ఫిర్యాదు మేరకు తిరుచానూరు CI సునీల్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం SV మెడికల్ కళాశాలకు తరలించారు.

Similar News

News February 24, 2026

త్వరలో ప్రసూతి, వివాహ కానుకలు: సుభాష్

image

AP: ఈ-శ్రమ్ పోర్టల్‌లో రాష్ట్రం నుంచి 88.16L మంది కార్మికులు నమోదయ్యారని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో 18.24L మంది చేరారని తెలిపారు. త్వరలో కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సాయం, మరణ, అంత్యక్రియల సమయంలో ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల కోసం సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తున్నామని అసెంబ్లీలో పేర్కొన్నారు.

News February 24, 2026

రూ.2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు: అనకాపల్లి

image

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 734 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సడక్ రోడ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News February 24, 2026

బాధితులకు మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వండి: సీఎం

image

AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల కలకలం నేపథ్యంలో CM CBN అధికారులతో సమీక్ష నిర్వహించారు. 32 మంది డయేరియా బారినపడ్డారని, వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. రోడ్డు రిపేర్ పనుల వల్లే నీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని CM ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.