News September 8, 2024
డోన్: చవితి వేడుకల్లో అపశ్రుతి..యువకుడి మృతి
డోన్ పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామా నగర్‌కు చెందిన కమ్మరి కౌశిక్ శనివారం రాత్రి గణేశ్ మండపానికి ప్లాస్టిక్ కవర్ కప్పబోయి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తోటి వారు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మరణించినట్లు తెలిపారు. దీంతో పండగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 7, 2024
నందికొట్కూరు: రూ.100కి చేరిన టమాటా
నందికొట్కూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లో టమోటా ధర రూ.70 -80 పలుకుతోంది. నందికొట్కూరు సంత మార్కెట్ లో సోమవారం రిటైల్ మార్కెట్లో టమాటా ధర రూ.100 దాటిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధర కూడా రూ.70- 80 కి చేరిందన్నారు.
News October 7, 2024
డోన్: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
డోన్‌లోని కొండపేట వాసి షేక్ మదార్‌వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్‌కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.
News October 7, 2024
అలంపూర్ మా అమ్మమ్మగారి ఊరు: కర్నూలు కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ జోగులాంబ శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు ఆదివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంపూర్ తన అమ్మమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపే వాళ్ళమని. అలంపూర్‌తో తనకున్న జ్ఞాపకాలను కలెక్టర్ నెమరేసుకున్నారు.