News February 9, 2025

డోన్: విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి

image

కూలి పనుల కోసం రేకుల షెడ్డు నిర్మాణానికి వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన విషాదకర సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. సుందర్ సింగ్ కాలనీకి చెందిన ఖాజాబాషా(32) కొత్తపల్లి గ్రామ సమీపంలో రేకుల షెడ్డు నిర్మాణానికి కూలి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా పైభాగంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

Similar News

News February 23, 2026

రాజమండ్రి కల్తీ పాల ఘటనపై YS షర్మిల సీరియస్!

image

రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.

News February 23, 2026

ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్ 70% పూర్తి

image

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ 70% పూర్తయినట్లు సమాచారం. తాజాగా 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో డార్లింగ్ మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని, ఇది ప్రేక్షకులకు థ్రిల్‌ను అందిస్తుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, జయప్రద, మిథున్ చక్రవర్తి కూడా పాల్గొన్నారని పేర్కొన్నాయి. ఈ పార్ట్ కథలో కీలకమైన మలుపుగా ఉంటుందట.

News February 23, 2026

నిర్మల్: ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

image

సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రక్త కళ్యాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.