News February 9, 2025
డోన్: విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి

కూలి పనుల కోసం రేకుల షెడ్డు నిర్మాణానికి వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన విషాదకర సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. సుందర్ సింగ్ కాలనీకి చెందిన ఖాజాబాషా(32) కొత్తపల్లి గ్రామ సమీపంలో రేకుల షెడ్డు నిర్మాణానికి కూలి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా పైభాగంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 12, 2026
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడండి: జేసీ

పోలవరం జిల్లాలో శైవ క్షేత్రాల్లో శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని జేసీ స్మరణ్ రాజ్ అన్నారు. రంప శివాలయాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు, ఆలయ కమిటీ సమన్వయంతో పని చేయాలన్నారు. భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు.
భారీగేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
News February 12, 2026
జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్లు

2023లో USలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి న్యాయం దక్కింది. ఆమె కుటుంబానికి $29 మిలియన్లు(రూ.262 కోట్లు) ఇచ్చేందుకు సియాటెల్ సిటీ విభాగం అంగీకరించింది. ‘జాహ్నవి మృతి బాధాకరం. ఆమె కుటుంబానికి ఆర్థిక సహకారం కొంత మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాం’ అని న్యాయవాది ఎరికా వెల్లడించారు. ఆమె మరణానికి <<13652111>>విలువలేదంటూ<<>> పోలీస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.
News February 12, 2026
ACTRECలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టాటా మెమోరియల్ సెంటర్ -అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్& ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ACTREC) 25 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM/DNB, MD, MSc/మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్/MBBS/BDS/BAMS/BHMS/ఫార్మా డీ, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://actrec.gov.in


