News October 7, 2024
డోన్: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
డోన్లోని కొండపేట వాసి షేక్ మదార్వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.
Similar News
News December 22, 2024
గుండెపోటుతో పాత్రికేయుడి మృతి
గడివేముల మండల విలేకరి మహబూబ్ బాషా గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. 4 రోజుల నుంచి అస్వస్థతతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ‘Iam Back’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టారు. అయితే నేడు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి విలేకరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన APUWJ సభ్యుడిగా పాత్రికేయ
రంగానికే వన్నెతెచ్చిన వ్యక్తిగా పేరు గడించారని పలువురు విలేకరులు కొనియాడారు.
News December 22, 2024
ఇంట్లో బంధించి మహిళపై ఆత్యాచారం.. నిందితుడికి రిమాండ్
మతిస్థిమితం లేని మహిళపై ఆత్యాచారం చేసిన జోగి హనుమంతును శనివారం రిమాండుకు తరలించినట్లు సీఐ మస్తాన్ వల్లి తెలిపారు. గత నెల 17న మతిస్థిమితం లేని మహిళను ఆదోనిలో అనాథాశ్రమంలో చేర్పిస్తానని మహిళ తల్లిదండ్రులతో నచ్చజెప్పి తీసుకొని జోగి హనుమంతు తన స్వగ్రామం ఆస్పరి మండలం ముత్తుకూరుకు తీసుకొచ్చాడు. ఇంటిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి, రిమాండ్కు పంపామన్నారు.
News December 22, 2024
మత్స్య శాఖ వనరులను అభివృద్ధి పరచండి: కలెక్టర్
నంద్యాల జిల్లాలో మత్స్య శాఖ వనరులను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి మత్స్య శాఖ ఉప డైరెక్టర్ రాఘవరెడ్డిని ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అత్యల్పంగా చేపల పెంపకం మన జిల్లాలోనే ఉందన్నారు. మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు.