News February 20, 2025
డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News September 18, 2025
నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.
News September 18, 2025
కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.
News September 18, 2025
HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.