News February 20, 2025
డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News March 22, 2025
IPL: టాప్‌లో వీరే..

★ అత్యధిక పరుగులు-కోహ్లీ(8004)
★ అత్యధిక వికెట్లు- చాహల్(205)
★ అత్యధిక సార్లు విజేత-ముంబై, చెన్నై(ఐదేసి సార్లు)
★ అత్యధిక ఫోర్లు- శిఖర్ ధవన్(768)
★ అత్యధిక POTM అవార్డులు- ఏబీ డివిలియర్స్(25)
★ అత్యధిక టీమ్ స్కోరు-SRH(287/3)
★ అత్యధిక సెంచరీలు-కోహ్లీ(8)
★ అత్యధిక అర్ధసెంచరీలు-వార్నర్(66)
News March 22, 2025
భీమడోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

భీమడోలు రైల్వే గేట్ శ్రీకనకదుర్గమ్మ టెంపుల్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనపై ఎస్ఐ సుధాకర్ వివరాల ప్రకారం.. పెదవేగి (M) వేగివాడకు చెందిన ఘంట భరత్ (21), చల్లా సుబ్రహ్మణ్యం మిత్రులన్నారు. ఇద్దరూ బైక్‌పై తాడేపల్లిగూడెం వెళుతుండగా భీమడోలులో వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టిందన్నారు. ఘటనలో భరత్ మృతి చెందగా.. సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.
News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు