News February 20, 2025

డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

image

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News March 19, 2025

బూర్గంపాడ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం క్రాస్ రోడ్డు సమీపంలోని రాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాంపురం గ్రామస్థుడిగా గుర్తించినట్లు సమాచారం.

News March 19, 2025

కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

image

TG బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఇందిర గిరి జల వికాసం’ పేరుతో నూతన స్కీమును అమలు చేయనున్నట్లు తెలిపింది. పోడుభూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది. నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ.12,600 కేటాయిస్తామని పేర్కొంది.

News March 19, 2025

మంత్రి సీతక్క పేరుతో నకిలీ MLA స్టిక్కర్‌

image

హైదరాబాద్‌‌లో నకిలీ MLA స్టిక్కర్ వేసుకొని సంచరిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క పేరుతో ఉన్న నకిలీ స్టిక్కర్ వాహనం (TG 09 HT R 1991) THARపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. మంత్రి పీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కార్ సీజ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!