News February 1, 2025

డోర్నకల్: అమల్లోకి ఎన్నికల కోడ్, ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగింపు

image

రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా డోర్నకల్ మున్సిపాలిటీలోని వివిధ పార్టీల జెండాలను, బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎవరు ఫ్లెక్సీలు బ్యానర్లు అంటించవద్దని మున్సిపల్ కమీషనర్ తెలియజేశారు.

Similar News

News October 20, 2025

VJA: రేపటితో ముగియనున్న గడువు.. మీ అభ్యంతరాలు తెలపండి

image

అమరావతి నగర అర్బన్ డిజైన్ & ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ (UDAG)ను APCRDA గత నెల విడుదల చేసింది. UDAGపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే రేపటిలోపు తెలియజేయాలని సూచించింది. UDAG డాక్యుమెంట్ APCRDA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, https://crda.ap.gov.in/APCRDAV2/UserInterface/Polling_Opinion.aspxలో ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని CRDA కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

News October 20, 2025

ఆత్మగౌరవమే కిరీటం! నీ లక్ష్యం కోసం కష్టపడు..

image

మిత్రమా.. ఆత్మగౌరవమే నీకు అసలైన కిరీటం. నిన్ను పట్టించుకోని వారి కోసం అస్సలు వెతకకుండా నిన్ను నువ్వు గౌరవించుకో. అవమానం జరిగితే నిశ్శబ్దంగా ఉండకుండా వెంటనే ధైర్యంగా సమాధానం చెప్పేసేయ్. నీకు సంతోషాన్ని ఇచ్చే పనులనే చెయ్యి. ఇతరుల గురించి మాట్లాడి సమయాన్ని వృథా చేయకుండా, నీ లక్ష్యాల కోసం కష్టపడు. నీ సమయం ఎంతో విలువైనదిగా భావించు. ఎప్పుడూ బిజీగా ఉండి నీ విలువను పెంచుకో! Share it

News October 20, 2025

ములుగు: ద్రోహులకు శిక్ష తప్పదు.. ‘మావో’ లేఖ

image

మావోయిస్టు పార్టీకి మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ముఠా వల్ల నమ్మకద్రోహం జరిగిందని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. వీరి మాయమాటలు నమ్మి కొందరు కామ్రేడ్స్ వీరి వెంట వెళ్లారని, వారంతా జీవితాలు ప్రశాంతంగా గడపాలన్నారు. విప్లవోద్యమ నష్టానికి కారకులైన మల్లోజుల, తక్కళ్లపల్లి ముఠాలకు శిక్ష తప్పదని, అమరుల త్యాగాల సాక్షిగా శపదం చేస్తున్నామన్నారు.