News April 4, 2025
డోర్నకల్: కుమారులకు విషం ఇచ్చిన తల్లికి రిమాండ్:CI

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్య తండా గ్రామంలో ఫిబ్రవరి 5 న గ్రామానికి చెందిన వాంకుడోత్ ఉష మహిళా తన భర్త వెంకటేష్ కు అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నారని ఇద్దరు పిల్లలకు తుమ్బసబ్ లో మందు కలిపి ఇచ్చింది. కుమారుడు వరుణ్ తేజ్ కోలుకోగా,కుమార్తె నిత్యా శ్రీ మృతి చెందింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తల్లి ఉష ను రిమాండ్ కోసం కోర్ట్ కు పంపనైందని డోర్నకల్ సిఐ రాజేష్ గురువారం తెలిపారు.
Similar News
News December 5, 2025
FLASH: ఏసీబీకి చిక్కిన HNK అడిషనల్ కలెక్టర్

హనుమకొండ అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన రూ.60,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి ఈ లంచం తీసుకున్నట్లు సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
News December 5, 2025
డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.
News December 5, 2025
నిర్మల్: ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

కలెక్టరేట్లో శుక్రవారం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలి దశ ర్యాండమైజేషన్ మండలాల వారిగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బందిని నియమించామన్నారు.


