News February 2, 2025
డోర్నకల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సోమేశ్వరరావు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర కానిస్టేబుల్ మృతిపై డోర్నకల్ పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News February 2, 2025
తెలుగోళ్లు.. టాలెంట్ చూపిస్తున్నారు
భారత జట్టు అనగానే అప్పట్లో ఒకరిద్దరి తెలుగు ప్లేయర్ల పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సిరాజ్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, గొంగడి త్రిష సత్తా చాటుతున్నారు. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ మరింత మంది ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News February 2, 2025
చిన్నారుల చిత్రహింసలపై.. కలెక్టర్ సీరియస్
జంగారెడ్డిగూడెంలో చిన్నారులను చిత్రహింసలు చేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సీరియస్ అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది, ఐసీడీఎస్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఆస్పత్రి సిబ్బంది, ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో వారిని సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
News February 2, 2025
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. విదేశాలకు శ్రీతేజ్?
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న గాయపడ్డ శ్రీతేజ్ రెండు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ట్యూబ్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నారు.