News April 14, 2025
డోర్నకల్, భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్-భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. 2008లో ప్రారంభమైన ప్రతిపాదనలు పలు కారణాలతో ఆగిపోయాయి. ఈ లైన్‌తో దూరం తగ్గడంతో పాటు గూడ్స్ రవాణా, హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైల్వేశాఖ అధికారులు డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపారు.
Similar News
News January 23, 2026
VZM: వివాహిత అనుమానాస్పద మృతి

విజయనగరంలోని అయ్యన్నపేటలో జయ కృష్ణవేణి(30) అనే వివాహిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. 1టౌన్ SI లీలావతి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం ప్రాంతానికి చెందిన చేతన్ ఆదిత్యతో ఆమెకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News January 23, 2026
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఎల్పుగొండ 13.9°C, లచ్చపేట 14.1, ఇసాయిపేట 14.4, రామలక్ష్మణపల్లి, జుక్కల్ 14.7, మేనూరు 14.9, దోమకొండ, గాంధారి 15°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా పాతరాజంపేటలో 0.5మి.మీ వర్షపాతం నమోదైంది. చలి ప్రభావం అంతంత మాత్రమే ఉన్నా రాత్రి వేళల్లో చలి గాలులు వీస్తున్నాయి.
News January 23, 2026
350 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBA, PGDBM, PGDM, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


