News February 24, 2025

డోర్నకల్: మార్గం మధ్యలో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో నల్ల ప్రభాకర్ (43) గుండెపోటుతో మృతి చెందాడు. కడుపు నొప్పి రావడంతో.. ఖమ్మంలో ఓ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News November 23, 2025

కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్‌తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

News November 23, 2025

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం

image

సింగరేణి సీఎండీ బలరామ్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి త్వరలో వాట్సాప్ నెంబరును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికి, ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎండీ వెల్లడించారు.

News November 23, 2025

ఈనెల 23న సత్య సాయి శతజయంతి ఉత్సవాలు: కలెక్టర్

image

రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం సత్యసాయిబాబా జన్మదిన వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు నిర్వహించాలన్నారు.