News February 2, 2025

డోర్నకల్: ముగ్గురు పిల్లలు, 12 పశువులపై దాడి

image

డోర్నకల్ మండలంలోని హూన్యతండా, లింబ్యతండాలో పిచ్చికుక్కలు ముగ్గురు పిల్లలపై దాడి చేశాయి. 12 పశువులపై దాడి చేసి గాయపరిచి బీభత్సం సృష్టించాయి. దీంతో రెండు గ్రామాల్లో ప్రజలు ఎటు వైపు నుంచి ఏ కుక్క వచ్చి కరుస్తుందేమోనని భయందోళనకు గురవుతున్నారు. పిల్లలు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి కుక్కలను అదుపు చేయాలన్నారు.

Similar News

News February 2, 2025

కులగణన సర్వే వివరాలు

image

TG: * సర్వేలో పాల్గొన్న జనాభా: 3.54 కోట్లు(96.9 శాతం)
* ఎస్సీల జనాభా: 17.43 శాతం
* ఎస్టీల జనాభా: 10.45 శాతం
* బీసీల జనాభా: 46.25 శాతం
* ముస్లిం మైనారిటీ బీసీలు: 10.08 శాతం
* ముస్లింల మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీలు: 56.33 శాతం
* ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతం
* ముస్లిం మైనారిటీలు: 12.56 శాతం
* ఓసీల జనాభా: 15.79 శాతం
* సర్వేలో పాల్గొనని జనాభా- 3.1 శాతం

News February 2, 2025

భారత జట్టుకు అభినందనలు: హోం మంత్రి అనిత

image

రెండవ సారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ అండర్-19 జట్టుకు ఏపీ ప్రభుత్వం తరఫున హోం మంత్రి వంగలపూడి అనిత ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. కౌలాలంపూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష మూడు వికెట్లు తీసి 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. బౌలింగ్‌లో విశాఖకు చెందిన షబ్నం ఒక వికెట్ తీయడం సంతోషాన్ని కలిగించిందన్నారు.

News February 2, 2025

వనపర్తి: గురుకుల ప్రవేశాలకు మరో అవకాశం

image

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.